Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాన్ ప్రభావంతో పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మంగళ, బుధవారాల్లో నడిచే 107 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే తెలిపింది. మంగళవారం 70, బుధవారం 36, గురువారం ఒక రైలును రద్దు చేసినట్లు వెల్లడించింది.
ఇక ఏపీ విషయానికొస్తే మంగళ, బుధవారాల్లో బయల్దేరే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. రాజమహేంద్రవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖ, ఒంగోలు, మాచర్ల నుంచి బయల్దేరే పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలను ప్రయాణికుల మొబైల్‌కు పంపించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి స్థాయి రిఫండ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే తమ ప్రయాణించాల్సిన రైలు స్టేటస్‌ను తెలుసుకోవాలని రైల్వే అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
రైళ్ల రద్దు నేపథ్యంలో విజయవాడ డివిజన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఆ వివరాలు ఇవి..
హెల్ప్‌డెస్క్ నంబర్లు
విజయవాడ 0866 – 2575167
నెల్లూరు 90633 47961
ఒంగోలు 78159 09489
బాపట్ల 78159 09329
తెనాలి 78159 09463
ఏలూరు 75693 05268
రాజమండ్రి 83319 87657
సామర్లకోట 73823 83188
తుని 78159 09479
అనకాపల్లి 75693 05669
భీమవరం 78159 09402
గుడివాడ 78159 09462