తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు(Tirumala) చేరుకున్నారు. ఈ సందర్భంగా 21 కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులు దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 61,178 మంది భక్తులు దర్శించుకోగా 22,464 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.85 కోట్లు ఆదాయం (Income) వచ్చిందన్నారు.