అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లాలో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య ( Suicide) చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు వాసి ప్రసన్న గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో ఉన్న దంత వైద్య కళాశాలలో చదువుకుంటుంది. గురువారం కళాశాల హాస్టల్ (Hostel)లో ఉంటున్న ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.