ఏలూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని అతడి భార్య కుటుంబసభ్యులు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని ముసునూరులో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన సాయిచంద్ సాయి దుర్గ గత ఎనిమిదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల సాయిదుర్గ తన ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది.
అయితే విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెళ్లికి ససేమిరా అని చెప్పారు. దాంతో సాయిచంద్, సాయిదుర్గ రెండు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. దాంతో మరింత ఆగ్రహానికి లోనైనా సాయిదుర్గ కుటుంబసభ్యులు సాయిచంద్పై దాడికి పాల్పడ్డారు. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సాయిదుర్గ కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.