అమరావతి : చిట్టీల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఏపీలోని కోనసీమ ( Konaseema ) జిల్లా రావులపాలెం మండలం కొత్త కాలనీకి చెందిన దంపతులు ఆత్మహత్య ( Couple Suicide ) చేసుకున్నారు. కర్రి నాగేశ్వరరెడ్డి, దుర్గాలక్ష్మీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి ( Suicide ) పాల్పడ్డారు.
చిట్టీల వ్యాపారంలో భాగంగా ఓ మహిళకు కోటి రూపాయలు ఇచ్చారు. ఆమె నుంచి తిరిగి డబ్బు రాకపోవడంతో విసిగి వేసారి, ఇతర చిట్టీ సభ్యుల నుంచి ఒత్తిడిలు రావడంతో చివరకు ఈ ఘాతుకానికి ఒడిగట్టామని లేఖలో పేర్కొన్నారు.
గత నెల 31న నాగేశ్వర రెడ్డి తీసుకున్న రూ.15 లక్షలు తిరిగి ఇవ్వకపోవడంతో కొప్పిశెట్టి నాగమల్లేశ్వరి అనే మహిళ ఆత్మహత్య చేసుకోంది. ఈ ఘటనతో తీవ్రంగా మనస్తాపానికి గురైన నాగేశ్వర రెడ్డి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .