AP news | ఏపీలో విషాదం చోటు చేసుకుంది. నాన్న జాగ్రత్త.. బతకాలని ఉన్నా బతకలేకపోతున్నాం అంటూ గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. దొడ్డ వెంకట సాయికృష్ణ, శిరీష దంపతులకు ఆరేళ్ల కిందట వివాహం కాగా వీరికి ఓ బాబు ఉన్నాడు. సాయి కృష్ణ హైదరా బాద్లో డ్రైవర్గా పనిచేసి అప్పులపాలై రెండు నెలల క్రితం భీమవరంలోని బంధువుల ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నారు.
స్నేహితుడు తాకట్టు పెట్టమని ఇచ్చిన ఉంగరం విషయంలో ఎదురైన వేధింపుల వల్లే తాము బలవన్మరణా నికి పాల్పడుతున్నట్లు గోదావరిలో దూకే ముందు ఆడియో విడుదల చేశారు. బతకాలని ఉన్నా బతకలేకపో తున్నామని, నాన్న జాగ్రత్త అంటూ ఆత్మహత్యకు ముందు ఆడియో విడుదల చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ని చించినాడ బ్రిడ్జి వద్ద మూడేళ్ల బాబును వదిలి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.