అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,882 మందిని పరీక్షించగా కొత్తగా 4,108 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది . 696 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రసుత్తం 30,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,018 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, ఉన్నతాధి కారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాప్తి నివారణకు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారు. బూస్టర్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు.