(Covid @ AP) విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్న 156 కేసులు నమోదు కాగా, నిన్న 262 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ రోజు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.
నిన్న కోవిడ్ నుంచి 247 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,128 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,978 కి చేరింది. వీరిలో 20,52,477 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కొవిడ్ వల్ల కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,415 కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 2.99 కోట్ల మంది శాంపిల్స్ పరీక్షించారు. కాగా, తూర్పు గోదావరిలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉండగా.. రెండో స్థానంలో చిత్తూరు, మూడో స్థానంలో కృష్ణ నిలిచాయి.
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
షుగర్‌ను ఇలా అదుపులో పెట్టుకోవాలి..! ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..