అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో (Srisailam EO) గా డి పెద్దిరాజు (Peddiraju) కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం సర్వీసును కొనసాగిస్తూ జీవో జారీ చేసింది. గతంలో ఈవోగా పనిచేసిన లవన్న నుంచి బాధ్యతలు స్వీకరించిన పెద్దిరాజు సంవత్సరం నుంచి సేవలు అందిస్తున్నారు. అయితే సర్వీసు గడువు ముగియడంతో పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈవో గా ఆయన పనిచేశారు.