తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏడుకొండలపై కొలువుదీరిన వేంకటరమణుడికి నిన్న ఒక్క రోజే రూ. 3.59 కోట్లు ఆదాయం ( Income ) వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు ( TTD Officials, ) వివరించారు. నిన్న స్వామివారిని 83,806 మంది భక్తులు దర్శించుకోగా 23,352 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కడప జిల్లా దేవుని కడపలో ఉన్న లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ను టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆవిష్కరించారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా 28న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుందని అర్చకులు వివరించారు. 29న ఉదయం 9.30 గంటలకు మీణ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.