తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వా్మి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలోని 31 కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి ఏటీసీ(ATC) వరకు క్యూలైన్లో నిలబడియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం(Sarvadarasan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 72,294 మంది భక్తులు దర్శించుకోగా 31,855 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.39 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో దర్శనం
అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) శనివారం హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.వాహన సేవలో ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, భక్తులు పాల్గొన్నారు.