అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లాలో (Krishna District ) ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable suicide) చేసుకున్నాడు. యనమలకుదురు గ్రామంలో కానిస్టేబుల్ మల్లెం చిరంజీవి మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బుధవారం స్థానికులు గమనించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.