అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (YS Jagan) ఏసీబీ (ACB) కి ఫిర్యాదు అందింది. అదానీ (Adani ) సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై సెంటర్ ఫర్ లిబర్టీ ( Centre For Liberty ) సంస్థ వ్యవస్థాపకుడు చక్రవర్తి ఈ మేరకు మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. జగన్‌కు రూ. 1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు.
సెకీతో అదానీ కంపెనీ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై విచారణ జరపాలని ఆయన కోరారు. జగన్‌కు అదానీ సంస్థ లంచం ఇచ్చినట్లు అమెరికా విచారణలో తేలిందని వెల్లడించారు. ఒప్పందానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి : షర్మిల
అదానీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు (Cancell) చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. అక్రమ డీల్‌తో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు అని.. ఈ డీల్‌ను వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సుదీర్ఘ లేఖను రాశారు.
అదానీతో జగన్ చేసుకున్నది అక్రమ ఒప్పందం అని షర్మిల ఆరోపించారు. దీనివల్ల 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం 1.50 లక్షల కోట్లు అని అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.