అమరావతి: ప్రభుత్వ ఆస్తులను అమ్మడంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్ పోటాపోటి పడుతున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకుడు తులసీరెడ్డి విమర్శించారు. దేశంలో ఏ ప్రధాని చేయనంతగా గడిచిన 7 ఏండ్లలో మోదీ రూ.74 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. అంతకుముందు ప్రధానులు 46లక్షల కోట్ల అప్పులు చేశారని వెల్లడించారు. అప్పులతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ వాటాలో 20శాతం విక్రయిస్తుండడం దారుణమని అన్నారు.
ఏపీ సీఎం జగన్ సైతం తానేమి తక్కువ కాదన్నట్లు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. లక్ష కోట్ల అప్పు చేస్తూ. . పన్నుల భారం మోపడం, ధరలు పెంచడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారని వాపోయారు.