అమరావతి : ఏపీలోని కాకినాడలో వేదిక కూలి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి నష్టం జరుగలేదు. కాకినాడ (Kakinada) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్గా జనసేనకు చెందిన తుమ్మలబాబును ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆదివారం పదవి ప్రమాణం స్వీకారం ఏర్పాటు సందర్భంగా అధికారులు వేదికను (Stage) ఏర్పాటు చేశారు.
ఈ వేదికపై చైర్మన్తో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి యనమాల రామకృష్ణ (Yanamala Ramakrishna) , మరో నేత పంతం నానాజీతో పాటు పరిమితికి మించి వేదికపై వచ్చారు. దీంతో వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో అందరూ కింద పడ్డారు. వేదిక ఎత్తు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం కింద పడ్డ నాయకులను సురక్షితంగా కాపాడారు. కొద్దిసేపు తరువాత ప్రమాణస్వీకారం యథావిధిగా కొనసాగింది.