Srisailam | అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ముందుగా వచ్చే రోజు) భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం.
Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ముందుగా వచ్చే రోజు) భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారికి సాత్విక బలి నిర్వహణకు (కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం నాడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. మంగళవారం (2024, మార్చి 26) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందు అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలు రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాదికాలు జరిపించారు. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగిందని శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు చెప్పారు.

Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

