అమరావతి : రాగల 24 గంటల్లో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో తేలకిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Department) వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
సోమవారం మధ్యాహ్నం వరకు తీరప్రాంతంలో (Coastal residents) అలల వేగం పెరుగుతుందని తెలిపింది. ఈ క్రమంలో జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అంతర్వేది నుంచి పెరుమల్లాపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు అతివేగంతో అలలు వస్తాయని హెచ్చరించింది. నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమగోదావరి తీరప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొంది. హార్బర్లు, మెరైన్ కార్యకలాపాల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.