అమరావతి : ఎన్టీఆర్ (NTR District) జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ(Cement Factory)లో జరిగిన బాయిలర్ పేలి ( Boiler explode) ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu ) ఆరా తీశారు. ఆదివారం జరిగిన ఘటనలో 20 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగ్రాతులు బిహార్(Bihar) , మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట , విజయవాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ సందర్భంగా ఏపీ సీఎం ఘటనపై స్పందించారు. బాధితులకు అండగా నిలబడాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పేలుడు ఘటనకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం (Compensation) అందేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు.