అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) కు చెందిన సీఎం, మంత్రులు అప్పుడే పొదుపు మంత్రాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు ( Austerity ) చర్యలు పాటించాలని దేశ ప్రజానికానికి పిలుపునిచ్చారు.
దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra babu ) కూడా రాష్ట్రంలో పొదుపు చర్యలను త్వరలో అమలు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే గురువారం నుంచే మంత్రులు తమ తమ కాన్వాయ్‌ను పెద్ద ఎత్తున తగ్గించుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ (Convoys ) లో మొత్తం 11 వాహనాలకు గాను నాలుగు వాహనాలకే పరిమితం చేశారు.
సీఆర్పీఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం జడ్ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత తదితరులు వాహనాల శ్రేణిని తగ్గించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్కార్ట్ లేకుండా నీటి పారుదల శాఖ మంత్రి రామానాయుడు సెక్రటేరియట్‌కు చేరుకోగా మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, డీఎస్‌బీవీ స్వామి, పయ్యావుల కేశవ్, మండిపల్లి, ఒక్కో వాహనంతోనే మంత్రి వర్గ సమావేశానికి చేరుకున్నారు.