Tirumala Parakamani Case | తిరుమల పరకామణి చోరీ కేసుకి సంబంధించి సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయన్నార్ బృందం మంగళవారం తిరుమలలో పర్యటించింది. శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించింది. దీనిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లోనూ నమోదైన రికార్డులను పరిశీలించింది.
2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది. 920 డాలర్లు చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డాడు. 40 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాసిచ్చి, గతంలో ఈ కేసును రాజీ కుదుర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదని ఇటీవల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. లోక్ అదాలత్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది.