TTD JEO | తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియామకమయ్యారు. ఆయన 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. డెప్యూటేషన్ పంపాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. దాంతో ఆయన డిప్యూడేషన్పై మూడేళ్లపాటు సేవలందించనున్నారు. ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిలెడ్ వైస్ చైర్మన్, ఎండీగా పని చేశారు. ఇదిలా ఉండగా.. ఐపీఎస్ అధికారి ఆకె రవికృష్ణను సైతం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు పంపింది. రవికృష్ణ ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన కర్నూలు ఎస్పీగా సేవలు అందించారు.