అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాలుగు రోజుల దావోస్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కె రోజా ( RK Roja ) ఆరోపించారు. భారీ ఆశలతో దావోస్ (Davos) వెళ్లిన చంద్రబాబు బృందం వట్టి్ చేతులతో తిరిగి వచ్చిందని విమర్శించారు.
శుక్రవారం నగరిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్కనున్న రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు వస్తుంటే చంద్రబాబు కట్టుకథలతో ఏపీకి వస్తోందని ఆరోపించారు. ప్రత్యేక విమానాలు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టినా కాని ఫలితం సాధించలేకపోయారని పేర్కొన్నారు. దావోసులోనూ పెట్టుబడిదారులను ( Investors ) మభ్యపెట్టాలని చూసిన వారు పట్టించుకోలేదని అన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్‌బుక్ (Red Book) రాజ్యాంగంతో భయపడి పెట్టుబడుదారులు ముందుకు రావడం లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌ను ( Pawan Kalyan ) దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లలేదని ఆమె ప్రశ్నించారు. పవన్ వస్తే లోకేష్ స్థాయి తగ్గిపోతుందని భయపడి తీసుకెళ్లలేదని అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు వస్తారని నిలదీశారు. వైఎస్ జగన్ హయాంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉండడంతో రాష్ట్రంలో పెట్టుబడులు దండిగా వచ్చాయి. మూడుపోర్టులు మచిలిపట్నం, మూలపట్నం, రామయపట్నం పనులు చేపట్టారని, భోగపట్నం ఎయిర్‌పోర్టు పనులను 35 శాతం పూర్తి చేయించారని అన్నారు.