అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు (Chandra Babu) మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. బుధవారం విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కొంత మంది ప్రముఖులకు స్వయానా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
సినీనటుడు చిరంజీవీ(Chiranjeevi), రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) తదితరులను ఆహ్వానించారు. నిన్నటి వరకు ఏపీ సీఎంగా పనిచేసిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కూడా ఆహ్వానించేందుకు ఫోన్ కాల్ ద్వారా ప్రయత్నించారు. అయితే చంద్రబాబు ఫోన్‌కాల్‌కు జగన్ అందుబాటులోకి రాలేదు. రేపటి ప్రమాణానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.