అమరావతి : ఏపీలో టీడీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే చంద్రబాబు జనసేన, బీజపీ తదితర పార్టీలతో జత కడుతున్నారని ఏపీ (Andhra Pradesh) మంత్రి రోజా (Minister Roja ) ఆరోపించారు. ఏనాడు కూడా బాబు సొంతగా గెలవలేదని విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు(Chandra Babu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి పండుగ లోగా టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పి ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. వారికి అభ్యర్థులు దొరకకపోవడం వల్లే పక్క పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు నాన్‌లోకల్ అని పేర్కొన్నారు. ఏపార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా వైఎస్ జగన్‌ను ఓడించలేరని అన్నారు.
పవన్‌కల్యాణ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని ఆరోపించారు. వైఎస్సార్ అభ్యర్థుల మార్పులు, చేర్పుల విషయంలో రోజా స్పందిస్తూ పనిచేయని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించానా వాటిని పట్టించుకోని నాయకుల స్థానాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారని వెల్లడించారు.