అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) మనవడు నారా దేవాన్ష్ (Nara Devansh ) చదరంగంలో (Chess) వేగంగా పావులు కదపడంలో రికార్డు సృష్టించాడు. చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించడంతో వరల్డ్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ (London) నుంచి నారా దేవాన్స్ ధ్రువపత్రం సాధించారు.
నారా దేవాన్ష్ రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా దేవాన్ష్ తండ్రి మంత్రి నారా లోకేష్ స్పందించారు. దేవాన్ష్ చెస్‌ను ఎంతో ఇష్టంగా స్వీకరించి, కొన్ని వారాలుగా ఈ రికార్డు కోసం శ్రమించాడని పేర్కొన్నారు. చదరంగంలో శిక్షణ ఇచ్చిన రాయ్ చెస్ అకాడమీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.