అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్య శిక్షణ (Skill Development) వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ విచారణకు ఆదేశించడంతో సీఐడీ (CID) అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) పై కేసు నమోదు చేశారు. ఈ కేసు అక్రమమని, అవినీతి జరుగలేదని పేర్కొంటూ హైకోర్టు(High Court)లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు శుక్రవారం జస్టిస్ బేల ఎం.త్రివేది(Justice Trivedi), జస్టిస్ పంకజ్ మిట్టల్(Justice Pankaj Mittal) తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు నాలుగువారాలు గడువు కావాలని, ఫిబ్రవరి 9వ తేదీకి విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరుఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. అదేరోజు తనక మరో పని ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు విన్నవించారు. చివరకు కేసును ఫిబ్రవరి 12కు వాయిదా వేస్తూ ధర్మాసనం అంగీకరించింది.