అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) కేంద్రానికి తాకట్టుపెట్టారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Ex-minister Karumuri) విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం తగ్గినా రాష్ట్రమంతా ఉద్యమిస్తామని మీడియా సమావేశంలో హెచ్చరించారు.
పోలవరం(Polavaram) ఎత్తు తగ్గిస్తే కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని విమర్శించారు. రైతుల కోసం చంద్రబాబు ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలను, రైతు బీమాకు మంగళం పాడారని మండిపడ్డారు. సూపర్ సిక్స్‌లో (Super Six) రైతులకు రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారని తెలిపారు. వై
సీపీ హయాంలో(YCP ) వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆదుకున్నారని పేర్కొన్నారు. సకాలంలో రైతు బీమాను రూ. 900 కోట్లు ప్రీమియం చెల్లించి ఉంటే ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా రూ. 13,000 కోట్ల పంట పరిహారం బీమా కంపెనీల నుంచి వచ్చేదని అభిప్రాయపడ్డారు. రైతు అంటే చంద్రబాబుకు నచ్చదని అన్నారు. రైతు భరోసా కేంద్రాలను గాలికొదిలేశారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారని తెలిపారు.