అమరావతి : ఏపీ రాజధాని అమరావతి( AmaravatI ) విషయంలో తాము వ్యతిరేకం కాదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) స్పష్టం చేశారు. అమరావతి పేరిట దోపిడీ చేయడానికి చంద్రబాబు ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. బుధవారం తాడేపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి లక్ష ఎకరాలు సేకరిస్తున్నారని, నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరముంటుందని ఇది ఆచరణలో సాధ్యం కాని పని అని విమర్శించారు. అంత ఖర్చును రాష్ట్రం భరించగలదా ఆలోచించాలని, ఆ భారం ప్రజలపై పడవద్దనే అభ్యంతరం చేశామని పేర్కొన్నారు.
రాజధాని విషయంలో సూచించిన ప్లాన్ బీ మావిగన్ ( మచిలీపట్నం, విజయవాడ, గుంటూర్) మధ్యన రాజధాని అనుకూలమని, అందుకు కావాలసిన నేషనల్ హైవే కూడా ఉందని ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన చంద్రబాబుకు నచ్చలేదని అన్నారు.
రాజధాని అభివృద్ధి అసాధ్యమని తెలసి కూడా తన స్కాంల కోసం, తన బినామీల భూముల రేట్ల కోసం అమరావతి రాజధాని చేస్తున్నాడని ఆరోపించారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల నిర్ణయంలో స్వార్ధం లేదని, సంకుచిత్వం అంతకంటే లేదని వెల్లడించారు.