చిత్తూరు : పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను మోసం చేసిన చంద్రబాబు ప్రజలను కూడా మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 16వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుట్రలు కుతంత్రాలు చంద్రబాబుకు బాగా తెలిసిన విద్యలని దుయ్యబట్టారు.
ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని, కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ వెంట ఉన్నారని ఆయన వెల్లడించారు. ఆయనతో పాటు ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, ఎంపీ రెడ్డప్ప , ఎమ్మెల్యే శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం ఇన్చార్జి భరత్ తదితరులు పాల్గొన్నారు.