అమరావతి : కృష్ణా జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గౌతమ్ రెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో ఈ విధానంతోనే పోటీకి దూరంగా ఉంటున్నామని వెల్లడించారు. ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని విమర్శించారు.
బద్వేలులో ఎందుకు పోటీ పెట్టలేదో ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టడం లేదని తెలిపారు. ఏపీలో అధికార పార్టీ నేతలు ప్రజలు, ఉద్యోగులపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఏఈ సూర్యకిరణ్పై వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేయడం దారుణమని , వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతుంటే ఏపీ సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి మూడేండ్ల నిర్వహణ వైఫల్యమే కారణమని ఆరోపించారు.