అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh kumar Meena) నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu)పై జగన్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించారు. సకాలంలో జగన్ స్పందించకపోతే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
చంద్రబాబును పశుపతితో పోల్చడం , మోసం చేయడమే చంద్రబాబు అలవాటు అంటూ జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయంటూ టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన సీఈవో మీనా జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనే కిందకు వస్తుందని ప్రాథమిక అంచనాకు వచ్చామని పేర్కొన్నారు.