South Coast Railway | విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కాగా, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను ఈ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేసినట్లుగా గెజిట్ నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది.
అలాగే వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్తగా రైల్వే డివిజన్ రాయగడ కేంద్రంగా ఏర్పాటైంది. మిగిలిన విభాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో విశాఖ డివిజన్‌గా మార్పుతున్నారు. తాజా గెజిట్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉంటాయి.