న్యూఢిల్లీ : (Kadapa Steel Plant) దీపావళి వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకుగాను కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సర్కార్ పంపిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి అనుమతి ఇస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్రం అనుమతుల మేరకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నుంచి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 3,591 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగనున్నది. ఏటా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతున్నది. దీని కోసం రూ.16,986 కోట్ల పెట్టుబడులు అవసరమని అంచనా వేశారు.
కడప జిల్లా సున్నపు రాళ్లపల్లె, పెద్దనందులూరు గ్రామాల్లో స్టీల్‌ప్లాంట్‌ను ఏపీ హై గ్రేడ్ స్టిల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నది. తొలి దశలో ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, 84.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనున్నది. మరోవైపు ప్రాజెక్ట్‌లో భాగంగా 33 శాతం.. 484.4 హెక్టార్లలో గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 జూన్ 10న కడప ఉక్కు పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.20 వేల కోట్లతో ఏర్పాటుచేయనున్నట్లు వైఎస్సార్ అప్పట్లో ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొసమెరుపు.
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన 20 మంది అరెస్ట్
మాజీ పోలీస్ కమిషనర్‌పై నాన్ బెయిలబుల్ వారంట్
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
మయన్మార్‌లో 100 మిలియన్ సంవత్సరాల వయస్సు పీత శిలాజం గుర్తింపు
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: వెంకయ్యనాయుడు
వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభం
చైనా హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష నిజమే సుమా: అమెరికా
మోదీ బలం అర్థం చేసుకుంటేనే.. బీజేపీని ఓడించొచ్చు: ప్రశాంత్ కిషోర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..