తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, ఢిల్లీ స్పోర్ట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందించి, సత్కరించారు. అనంతరం కరణం మల్లీశ్వరి మాట్లాడుతూ తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తుండడం సంతోషకరమని అన్నారు. ఇదిలా ఉండగా.. నిన్న శ్రీవారిని 29,652 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.2.75 కోట్ల ఆదాయం సమకూరింది.