ఏపీలో కేంద్ర మాజీ మంత్రిపై కేసులు నమోదు..

అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుపై రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం
బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శిలాఫలకాన్ని నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని ఆలయ ఈవో ప్రసాద్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై ఈరోజు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ .. రామతీర్థంలో నిన్న జరిగిన ఘటన విచిత్రంగా ఉందని అన్నారు. శంకుస్థాపనలో సంప్రదాయం పాటించకపోవడం చూసి బాధ కలిగించిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తనపై ప్రత్యేక కక్ష సాధింపు దృష్టి సారించిందని ఆరోపించారు. ఆలయానికి వాడుతున్న రూ.3 కోట్ల నిధులు ప్రభుత్వ ధనం కాదని, .హిందూ ధర్మం ప్రకారమే ఆలయాలకు విరాళాలు తీసుకుంటారని, ఈ విరాళాలను దేనికీ వాడకూడదు సూచించారు. పూజా కార్యక్రమాలకు అడ్డు తగిలితే నాపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

