అమరావతి : తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారంతా మంటలు అంటుకొని దగ్ధమైంది. మంటలను గమనించిన భక్తులుంతా కారు దిగి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పలువురు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.