తిరుమల : ఈనెల 27న శ్రీకృష్ణజన్మాష్టమి (Srikrishnajanmashtami ) సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించనున్నామని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు బంగారు సర్వభూపాల వాహనంపై కృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తామన్నారు.
ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి(Sridevi), భూదేవి (Bhudevi) అమ్మవార్లకు, కృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించి , ద్వాదశారాధనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఆగస్టు 28న ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మలయప్పస్వామివారిని బంగారు తిరుచ్చిపై, కృష్ణస్వామివారిని మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగింపు ఉంటుందని వివరించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన బ్రహ్మోత్సవం (Brahmotsavam), సహస్రదీపాలంకార సేవలను(Sahasradipalankara Cancel) రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read more :
Brahmotsavam | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు వసతి రద్దు