Deputy CM Mallubhatti Vikramarka | తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Deputy CM Mallubhatti vikramarka | తెలంగాణ అంటే కళలు, విప్లవం, ప్రశ్నించడం, సున్నిత మనసుతో, ప్రేమానురాగాలతో కూడినదని, తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్ అని.. అందుకే వారి పేరు మీద గత సంవత్సరం నుండి సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
Deputy CM Mallubhatti vikramarka | దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సెక్రటేరియట్లో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బాంబే, కలకత్తా, చెన్నై వంటి పట్టణాల్లో సినీ ఇండస్ట్రీ పెరగడానికి అంతగా అవకాశాలు లేవు కానీ దేశంలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీ హైదరాబాద్లో విస్తరించడానికి సానుకూల అంశాలు అనేకంగా ఉన్నాయన్నారు.
సకల భాషల సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరలి వస్తే రాష్ట్ర యువతకు, టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లకు ఉపాధి లభిస్తుంది. సినీ ప్రపంచ మార్కెట్కు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రభుత్వం తయారు చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. సమాజంలో అత్యంత ప్రభావం చూపే సామాజిక పరివర్తన తీసుకొచ్చే సినీ రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుందని వివరించారు.
సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు గద్దర్..
సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గద్దర్ అన్నారు. తెలంగాణ అంటే కళలు, విప్లవం, ప్రశ్నించడం, సున్నిత మనసుతో, ప్రేమానురాగాలతో కూడినదని, తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్ అని.. అందుకే వారి పేరు మీద గత సంవత్సరం నుండి సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకతలే ప్రమాణంగా సినిమా అవార్డుల ఎంపిక ఉంటుందని, గత సంవత్సరం జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి అభినందనలు పొందిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
సినీ రంగ ప్రముఖులకు ఉన్న అనుభవాన్ని, నిబద్ధతను, సినిమా రంగం పట్ల వారికున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్డీసీ ద్వారా అందరితో సంప్రదింపులు జరిపి జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేశారని.. ప్రభుత్వం నుంచి కావలసిన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందజేస్తామని తెలిపారు.
సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా..
గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతోపాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ నెల 6 నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 19న ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు.
గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప సందేశం ఇచ్చేలా గత సంవత్సరం నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో పెద్ద ఎత్తున గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్,ఐ అండ్ పీఆర్ శాఖలకు పూర్తి స్వాతంత్రం, అవసరమైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబుతోపాటు సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, కేఎస్ రామారావు, రోజా రమణి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Suryapet : ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్పై వేటు వేయాలి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
BC JAC : మిర్యాలగూడలో బీసీ జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్
Arrest : కనగల్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

