Turkish Airlines | విమానం ఇంజిన్లో మంటలు.. కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన టర్కీ విమానం
Turkish Airlines : టర్కీకి చెందిన విమానం కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నుంచి ఇస్తాంబుల్ (టర్కీ) వెళ్తున్న విమానాన్ని బుధవారం మధ్యాహ్నం కోల్కతాలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Turkish Airlines : టర్కీకి చెందిన విమానం కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నుంచి ఇస్తాంబుల్ (టర్కీ) వెళ్తున్న విమానాన్ని బుధవారం మధ్యాహ్నం కోల్కతాలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. టీహెచ్వై 727 అనే విమానం బుధవారం మధ్యాహ్నం 01.28 గంటలకు ఖాట్మాండ్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరింది.
విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బందికి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో దాదాపు పది నిమిషాలు ఆ విమానం అలాగే గాల్లోనే ఎగిరింది. దీంతో అధికారుల సూచన మేరకు విమానాన్ని తిరిగి త్రిభువన్ ఎయిర్ పోర్టుకు రప్పించారు. అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఎయిర్ పోర్టు మూసేశారు. అనంతరం తిరిగి విమానం కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు.
తిరిగి అక్కడి నుంచి బయల్దేరిన విమానం 02.49 గంటలకు కోల్కతాలోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం అక్కడ విమానానికి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 236 మంది ఉన్నారు. వీరిలో 225 మంది ప్రయాణికులు కాగా.. 11 మంది సిబ్బంది. భారత ఎయిర్పోర్ట్ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

