Srisailam | శ్రీశైల మహా క్షేత్రంతో అనుబంధం ఉన్న గిరిపుత్రులకు కోడె దూడలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శుక్రవారం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోశాల వద్ద చెంచులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కోడె దూడలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. గిరిజన రైతులు వ్యవసాయంలో మరింత ముందుకు వెళ్లేందుకు తాను అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు.
పలు జిల్లాల నుండి వచ్చిన చెంచు రైతులకు డిప్ సిస్టమ్ ద్వారా ఈ కోడె దూడలను పంపిణీ చేశారు. అందుకోసం 107 మంది రైతులు నామమాత్రంగా రూ.1000 దేవస్థానానికి ఫీజు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, ఐటీడీఎ పీవో రవీంద్రారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.