Two Headed Calf | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపల్లిలో వింత దూడ (Two Headed Calf ) జన్మించింది. కుంచేపల్లి పంచాయతి పరిధిలోని గురువాయపాలెం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి వెంటకరెడ్డి అనే రైతుకు చెందిన బర్రె ఓ దూడకు జన్మనిచ్చింది. దానికి రెండు తలలు ఉండటంతో అంతా ఆశ్యర్యానికి గురయ్యారు. దానిని చూడటానికి చుట్టుపక్కల వారు పోటెత్తారు.
విషయం తెలుసుకున్న పశువైద్యులు బ్రహ్మయ్య.. రైతు ఇంటికి వెళ్లి దూడను పరిశీలించి ఆరోగ్య పరీక్షలు చేశారు. జన్యులోపంతో అరుదుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని, ప్రస్తుతం దూడ ఆరోగ్యంగానే ఉందని వెల్లడించారు.