KCR | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీడీపీ – జనసేన కూటమికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అభినందించారు.
కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారిక వైసీపీ పార్టీకి ప్రజలు భారీ షాకిచ్చారు. 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి పట్టం కట్టారు. టీడీపీ కూటమి 164 సీట్లలో గెలుపొందగా.. వైసీపీ కేవలం 11 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించిన వైఎస్ జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించారు.