అమరావతి : ఏపీలోని తూర్పుగోదావరి ( East Godavari ) జిల్లా మల్కిపురం మండలం లక్కవరం శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) అన్నదమ్ములిద్దరు ( Brothers Die ) మృతి చెందారు. వారి భార్యలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన రొయ్యల వ్యాపారం ( Prawn business ) చేసుకునే అన్నదమ్ములు ముదునూరి రామభద్ర రాజు, అతని సోదరుడు వెంకట సుబ్బరాజు వారి భార్యలతో కలిసి భీమవరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
అక్కడి నుంచి శుక్రవారం బయలు దేరగా మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు లక్కవరం ఓఎన్జీసీ సైట్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కొబ్బరి చెట్టుకు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా వారి భార్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.