పల్నాడు జిల్లాలో దారుణం.. వీడియో తీస్తూ మహిళపై అన్నదమ్ముల లైంగిక దాడి
ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలో ఓ మహిళపై అన్నదమ్ములిద్దరు వీడియో తీస్తూ లైంగిక దాడికి పాల్పడ్డారు.
అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలో ఓ మహిళపై అన్నదమ్ములిద్దరు వీడియో తీస్తూ లైంగిక దాడికి పాల్పడ్డారు. సత్తెనపల్లి సీఐ కిరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన భర్తతో విడాకులు తీసుసుకొని తమ ముగ్గురు కూతుళ్లతో జీవిస్తున్నది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్‌తో సదరు మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ క్రమంలో సుధాకర్ సదరు మహిళకు ఫోన్ చేసి మట్లాడే పని ఉందని ఊరి చివరికి పిలిపించుకున్నాడు. అప్పటికే తాగి ఉన్న సుధాకర్ తన సోదరుడు శ్రీనుతో కలిసి మహిళను చెట్టుకు కట్టేసి వీడియో తీస్తూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె అతి కష్టంగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నిందితులిద్దరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. కాగా, సుధాకర్‌పై గతంలో ప్రేమ, పెళ్లి పేరుతో ముగ్గురు యువతుల్ని మోసగించినట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

