బ్యాంకు మేనేజరే అసలు దొంగ.. శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంక్ చోరీలో బిగ్ ట్విస్ట్
Srikalahasti Fincare Bank Robbery || తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంకు చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ ! తనను కట్టేసి బ్యాంకు దోచేశారని ఫిర్యాదు చేసిన మేనేజరే.. దోపిడీకి అసలు సూత్రధారి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. తన బండారం బయటపడుతుందనే భయంతో బ్రాంచ్ మేనేజర్ స్రవంతి పథకం ప్రకారమే బ్యాంకులో దోపిడీలో నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు.బ్యాంకు దోపిడీ కేసులో పోలీసులకు ముందు నుంచి ఇంటి దొంగల పాత్ర మీద అనుమానం ఉంది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి.
అసలేం జరిగిందంటే..
బ్రాంచ్ మేనేజర్ స్రవంతి.. గిల్టు నగలు పెట్టి తాను పనిచేసే బ్యాంకు నుంచి రుణాలు కాజేసింది. అయితే తొందరలోనే బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిట్ చేయబోతున్నారని తెలిసి కంగారుపడిపోయింది. ఆడిట్ జరిగితే తన బండారం బయటపడుతుందని భయపడిపోయింది. దీంతో బ్యాంకు దొంగతనం నాటకానికి తెర తీసింది. చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని బ్యాంకు దోపిడీ డ్రామాకి స్కెచ్ వేసింది. పక్కా ప్లాన్ ప్రకారం గురువారం రాత్రి బ్యాంకులోకి వచ్చిన యువకులకు.. లాకర్లో 67 ప్యాకెట్లలో ఉన్న దాదాపు రెండు కేజీల బంగారం, 5 లక్షల రూపాయల నగదు ఇచ్చి పంపించింది. ఆ తర్వాత దొంగతనం గురించి విచారణ చేపట్టిన పోలీసులకు.. ముసుగుతో వచ్చిన ముగ్గురు యువకులు బ్యాంకుకు కన్నం వేసినట్లు తెలిపింది. తన చేతులు కట్టేసి, అరవకుండా నోటిలో గుడ్డకుక్కి బెదిరించి దుండగులు బ్యాంకు లూఠీ చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతిని కూడా విచారించారు. ఈ క్రమంలో ఆమె ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పింది. అలాగే సీసీ టీవీ ఫుటేజీని గమనించగా.. అందులో స్రవంతి వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో స్రవంతిని విచారించి ఆమె నుంచి అసలు నిజాన్ని రాబట్టారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే బ్యాంకు చోరీకి ప్లాన్ వేసిందని పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

