TTD Chairman | టీటీడీ చైర్మన్‌గా రేపు బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం
TTD Chairman | టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా బీఆర్ నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తిరుమల : టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా (TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుల జాబితాను వారం రోజుల క్రితం ప్రకటించింది. చైర్మన్‌తో సహా మొత్తం 25 మంది సభ్యులతో పాటు మరో నలుగురు అధికారులను ఎక్స్అఫిషియో (Ex-Officio) సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నూతన చైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు మంగళవారం రాత్రి తిరుమలకు(Tirumala) చేరుకున్నారు. చైర్మన్‌గా రాక సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం స్వామివారి దర్శనం అనంతరం చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీటీడీ పాలక మండలిలో ఏపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు.
తెలంగాణ(Telangana) లో వివిధ రంగాలకు చెందిన ఐదుగురికి, కర్ణాటకకు చెందిన ముగ్గురిని, తమిళనాడుకు చెందిన ఇద్దరిని నియమించారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి , నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్ , శాంతరామ్ , రామ్మూర్తి , తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్‌కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరబ్ హెచ్. బోరా,బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డిలను సభ్యులుగా నియమించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

