అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్లో (Railway Station) ప్రమాదం చోటుచేసుకున్నది. పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడటంతో ఓ బాలుడు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం బాలుడి కుటుంబం రామేశ్వరం వెళ్లేందుకు గుంతకల్లు రైల్వే స్టేషన్కు వచ్చింది. ఏడో నంబర్ ప్లాట్ఫాం వద్ద రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రంమంలో ప్లాట్ఫాం పైకప్పు పెచ్చులూడి బాలుడిపై పడింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు.