YCP MLC Botsa | ఏపీలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స కీలక వ్యాఖ్యలు
YCP MLC Botsa | ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లపై వైసీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కూటమి సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu ) పర్యటన ఏర్పాట్లపై వైసీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కూటమి సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై ఒకటిన రాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటన సందర్బంగా ఆమెకు ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాటుపై మండిపడ్డారు.
వాస్తవానికి ఆమెకు ప్రభుత్వ అతిధి గృహంలో బస ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రైవేట్ సంస్థకు సంపదను దోచుపెట్టేందుకు రాష్ట్రపతిని ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం పరువు పోతుందని పేర్కొన్నారు. అవసరం అనుకుంటే ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని, వైసీపీ నాయకులు అమరావతిలో రైతులతో మాట్లడేందుకు వెళ్తే టీడీప గూండాలు దాడులకు పాల్పడి తమపైనే ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చను తీసుకువస్తున్నారని వెల్లడించారు.
అమరావతిలో అక్రమాలు బయట పడతాయనే భయంతో ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. దేశ సంస్కృతికి విరుద్దంగా బీచ్‌లు, ఎయిర్‌పోర్టులలో బార్లు పెట్టే ఆలోచనను వ్యతిరేకించారు. ఏపీలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు మొదట నష్టపోయేది రైతులేనని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

