అమరావతి : ఏపీ ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రకటించిన ఉచిత సిలిండర్ ( Free cylinder ) పథకానికి ఈనెల 29 నుంచి బుకింగ్స్ (Bookings) చేసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ప్రకటించారు. ఈనెల 30న సీఎం చేతుల మీదుగా తొలి సిలిండర్ఇప్పిస్తామని పేర్కొన్నారు.
గ్యాస్ కనెక్షన్‌కు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్ (LPG Collections) , తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండాలని సూచించారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని , పథకం అందకపోతే టోల్‌ఫ్రీ నెంబర్ 1967 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.ఈరోజే దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామని వివరించారు.
అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు రూ. 894 కోట్లను సీఎం చేతుల మీదుగా అందించబోతున్నామని వెల్లడించారు. రెండో సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు , ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు మూడో సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.
రాబోయే రోజుల్లో కొత్త రేషన్‌కార్డులు అందించబోతున్నామని, వాటి డిజైనింగ్ జరుగుతుందని తెలిపారు. కోటి 55 లక్షల కనెక్షన్లకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని, వీటిలో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కేవలం 9 లక్షల 65 వేల సిలిండర్లు వస్తున్నాయని తెలిపారు.