అమరావతి : తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి(Renigunta airport) అగంతకుడి నుంచి బాంబు బెదిరింపు (Bomb threat) రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండురోజుల క్రితం సీఐఎస్ఎఫ్(CISF) అధికార వెబ్‌సైట్‌కు ఈ మెయిల్ (E-Mail) ద్వారా బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై భద్రతను మరింత పటిష్టం చేశారు. వచ్చిన బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది కనుగొనేందుకు తిరుపతిలోని ఏర్పేడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.